
తాజా వార్తలు
మలయాళ సినిమా సత్తా చాటింది: వెంకటేశ్
హైదరాబాద్: ఆస్కార్ పురస్కారానికి అర్హత సాధించడంతో మలయాళ సినీ పరిశ్రమ తన సత్తా చాటిందని టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్ అన్నారు. ఆ చిత్ర బృందం మొత్తానికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. మలయాళీ చిత్రం జల్లికట్టు ‘ఆస్కార్’కు అర్హత సాధించిన సందర్భంగా వెంకటేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జల్లికట్టు’కు లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వం వహించారు. ‘ఆస్కార్’ కోసం పోటీపడ్డ శకుంతలా దేవీ, గుంజన్ సక్సేనా, ఛపాక్, గులాబో సితాబో, చెక్‌పోస్ట్, స్కై ఈజ్ పింక్ ఇలా మొత్తం 27 ఉత్తమ చిత్రాలను పరిశీలించిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ‘జల్లికట్టు’ను ఎంపిక చేసింది. ఈసారి ఆస్కార్ రేసులో ఈ సినిమా నిలిచినట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల మల్టీస్టారర్ చిత్రాలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు వెంకీమామ. ప్రస్తుతం నారప్ప చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్3’లో నటించనున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్2’ మంచి విజయం సాధించింది. ఇటీవల ప్రకటించిన ఇండియన్ పనోరమ అవార్డు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. దీంతో దానికి సీక్వల్గా ‘ఎఫ్3’ని తెరకెక్కించాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు వెంకటేశ్, రానా కాంబినేషన్లో మరో మరోసినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథను ఫైనల్ చేశామని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని స్వయంగా రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇవి చదవండి..
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
