Radhe Leak: రాధే లీక్‌.. సల్మాన్‌ వార్నింగ్‌ - salman khan warns of on radhe leaks
close
Published : 16/05/2021 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radhe Leak: రాధే లీక్‌.. సల్మాన్‌ వార్నింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీని కూడా పైరసీ భూతం వదలడం లేదు. కొత్త సినిమాలు విడుదలవడమే ఆలస్యం సినిమాను పైరసీ చేసి ఇంటర్నెట్‌లో పెట్టేస్తున్నారు. తాజాగా విడుదలైన సల్మాన్‌ఖాన్‌ చిత్రం ‘రాధే’కు ఇదే సమస్య ఎదురైంది. ‘జీప్లెక్స్‌’లో గురువారం విడులైందీ చిత్రం. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్‌ఖాన్‌కు జోడీగా దిశాపటాని సందడి చేసింది. సినిమాను ఓటీటీలో ‘పే పర్‌ వ్యూ’ విధానంలో విడుదల చేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లోనూ సినిమా లీక్‌ అయింది. మరోవైపు ఓటీటీ సర్వర్లు స్తంభించిపోవడంతో ప్రేక్షకులు చాలామంది ఆన్‌లైన్‌లో వచ్చిన పైరసీని ఆశ్రయించారు. ఈ విషయమై చిత్రబృందం స్పందించింది. సల్మాన్‌ఖాన్‌ సోషల్‌ మీడియా వేదికగా గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. పైరసీదారులకు కఠిన చర్యలు తప్పవని.. పైరసీలో సినిమా చూసేవారికి కూడా ఇబ్బందులు వస్తాయని అన్నారు.

‘‘వీక్షణకు రూ.249 చొప్పున మీకు ‘రాధే’ను అందుబాటులో ఉంచాం. ఆ సినిమాను మీరు పైరసీ చేయడం చట్ట విరుద్ధం. తీవ్రమైన నేరం కూడా. ఈ అక్రమ సైట్ల నిర్వాహకులతో పాటు వాటిని వినియోగిస్తున్నవారిపై సైబర్‌ సెల్‌ చర్యలు తీసుకుంటుంది. పైరసీని ఎవరూ ప్రోత్సహించవద్దు. దయచేసి అర్థం చేసుకోండి. సైబర్‌సెల్‌తో మీకు ఇబ్బందులు తప్పవు’ అని సల్మాన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. సినిమా విడుదలకు ముందే సరైన వేదికపై చిత్రాన్ని ఆస్వాదించాలని అందరికీ సల్మాన్‌ విజ్ఞప్తి చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని