𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬: ఆలీకి శుభాకాంక్షలు చెప్పిన ప్రభాస్‌ - 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 wishing 𝐀𝐥𝐢 and enitre team of andarubagundali andulo nenundali
close
Updated : 25/06/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬: ఆలీకి శుభాకాంక్షలు చెప్పిన ప్రభాస్‌

హైదరాబాద్‌: ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. మనం థియేటర్‌లలో ఉండాలి’ అంటున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. ప్రముఖ హాస్య నటుడు ఆలీ నిర్మాత వ్యవహరిస్తూ ‘ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. కిరణ్‌ శ్రీపురం దర్శకుడు. ఆలీ, నరేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరివాడు అయిన ఆలీకి ఈ మూవీ మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు.

మరోవైపు ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వీడియోలో ప్రభాస్‌ కనిపించడంతో ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ‘డార్లింగ్‌’ ఇలాగైనా దర్శనమిచ్చాడని సంబరపడుతున్నారు. ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ తుది షెడ్యూల్‌ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. ఒక పాట, కొన్ని సన్నివేశాలు తీస్తే సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్‌’లో పూజా హెగ్డే కథానాయిక.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని