భారత్‌లో ఆగస్టు నాటికే 7.4 కోట్ల మందికి వైరస్‌! - భారత్‌లో ఆగస్టు నాటికే 7.4 కోట్ల మందికి వైరస్‌!
close
Published : 28/11/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో ఆగస్టు నాటికే 7.4 కోట్ల మందికి వైరస్‌!

50 శాతం మందికి సోకనున్నట్లు అధ్యయనంలో వెల్లడి 

దిల్లీ: దేశంలో ఆగస్టు నాటికే 7 శాతం మందికి కరోనా సోకిందని ఓ అధ్యయనం పేర్కొంది. పది సంవత్సరాలు పైబడిన 74.3 మిలియన్ల (7.43 కోట్లు) భారతీయులకు 2020 ఆగస్టు నాటికే వైరస్‌ సోకిందని భారతీయ ఔషధ పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సీరో సర్వేలో వెల్లడించింది. రోగ నిరోధకశక్తి అధికంగా ఉండటంతో అధికశాతం మందిలో లక్షణాలు బయటపడలేదని తెలిపింది. భారత్‌లో దాదాపు 50 శాతం మందికి వ్యాధి సోకనుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అధ్యయనం‌ లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల గ్రామాలతో పోలిస్తే నగర జనాభాకు వైరస్‌ అధికంగా సోకిందని పేర్కొంది. ముఖ్యంగా మురికివాడల్లో ఉండే అనేకమంది ఆగస్టు  నాటికే వ్యాధి బారిన పడ్డారని తెలిపింది.

‘భారత్‌లో 2020 ఆగస్టు నాటికే 10 సంవత్సరాలు దాటిన ప్రతి 15 మందిలో ఒకరికి కొవిడ్‌ సోకింది. మే నుంచి ఆగస్టు వరకు మధ్య వయస్కుల్లో వ్యాప్తి తీవ్రత పదింతలు పెరిగింది. కానీ లక్షణాలు బయటపడలేదు’ అని వెల్లడించింది. రానున్న రోజుల్లో గ్రామాల్లోనూ వైరస్‌ విజృంభించనున్నట్లు పేర్కొంది. ‘సహజంగా కానీ, టీకాల వల్ల కానీ హెర్డ్‌ ఇమ్యూనిటీ లభించేవరకూ భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో కరోనా విజృంభన కొనసాగుతుంది. లక్షణాలు తెలియకుండానే 50 శాతం మందికి సోకనుంది’ అని అధ్యయనం తెలిపింది. యాంటీబాడీలు ఉండటం వల్లనే ప్రతి 10లో 9మందిలో వ్యాధి లక్షణాలు కనిపించలేదని పేర్కొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని