వ్యాన్‌లో మంటలు..13 మంది సజీవదహనం - ​​​​​​​Passenger bus catches fire in Pakistan 13 killed
close
Updated : 27/09/2020 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాన్‌లో మంటలు..13 మంది సజీవదహనం

కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను బోల్తా కొట్టడంతో భారీ ఎత్తున మంటలంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న 13 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి, డ్రైవర్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వ్యానులో 20 మంది ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కరాచీ వస్తున్న సమయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కారు కింది భాగంలో ఉండే ‘టై రాడ్‌’ విరిగిపోవడం వల్లే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో వాహన వేగం అధికంగా ఉండడంతో బోల్తా కొట్టిన వ్యానులో వెంటనే మంటలు అంటుకున్నాయని కరాచీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అవి కాస్తా ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయని.. దీంతో ప్రయాణికులు మృతి చెందారని వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని