అదే నిజమైన దేశభక్తి - ‘Best deshbhakti’: Kejriwal urges AAP workers to distribute free masks
close
Published : 20/11/2020 23:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే నిజమైన దేశభక్తి

* కరోనా నివారణకు కలసి పోరాడదామని పిలుపునిచ్చిన కేజ్రీవాల్

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ చేసిన కేజ్రీవాల్‌.. నాయకులు, ఆప్ కార్యకర్తలు దిల్లీలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని కోరారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే మనం ఒకరికొకరు తోడుగా ఉండి సహాయం చేసుకోవాలన్నారు. ఇటువంటి సమయాల్లోనే దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు మాస్కులను పంపిణీ చేయాలని సూచించాల్సిందిగా కోరారు.

కొవిడ్‌ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దిల్లీలో కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో మాస్కు ధరించని వారికి రూ.2000 అపరాధ రుసుంగా విధించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 80శాతం బెడ్లను కరోనా పేషెంట్లకు కేటాంయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కరోనా టెస్టులు ఇప్పటకే రెండింతలు పెంచారు. దిల్లీలో కొవిడ్‌ మరణాల శాతం పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని