సోనూసూద్‌ను కలిసేందుకు 700KM నడిచాడు! - a boy walked barefoot all the way from hyd to mumbai to meet sonusood
close
Published : 11/06/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూసూద్‌ను కలిసేందుకు 700KM నడిచాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ హీరో అయ్యారు సోనూసూద్‌. ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సోనూసూద్‌ను కలవాలన్న లక్ష్యంతో వికారాబాద్‌కు చెందిన వెంకటేశ్‌ ఓ యువకుడు ముంబయికి బయలుదేరాడు. కాలి నడకన వికారాబాద్‌ నుంచి బయలుదేరాడు. ‘ది రియల్‌ హీరో సోనూసూద్‌.. నా గమ్యం.. నా గెలుపు’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని ముంబయి చేరుకున్నాడు. 700 కిలోమీటర్ల ప్రయాణించి ఎట్టకేలకు సోనూసూద్‌ను కలుసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూదే ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. వెంకటేశ్‌తో దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారు.

‘‘వెంకటేశ్‌, నన్ను కలిసేందుకు హైదరాబాద్‌ నుంచి ముంబయికి నడుచుకుంటూ వచ్చాడు. అతడు తిరిగి ఇంటికి చేరుకునేందుకు నేను రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాను. నాకు ఓ వైపు గర్వంగా ఉన్నప్పటికీ ఇలాంటివి ప్రోత్సహించలేను. దయచేసి ఎవరూ ఇలాంటి చర్యలకు ఉపక్రమించొద్దు’’ అని సోనూసూద్‌ పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని