దొంగల ‘హౌస్‌ అరెస్ట్’ - ‘house arrests’ of thieves
close
Updated : 27/02/2021 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దొంగల ‘హౌస్‌ అరెస్ట్’

హైదరాబాద్: హా‌స్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అల్లరి రవి బాబు, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హౌస్ అరెస్ట్’. శేఖర్‌రెడ్డి యర్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఈరోజు విడుదలైంది. ‘‘సార్‌ మా మొగుళ్లు తప్పిపోయారు’’ అంటూ టీజర్‌ ప్రారంభమవుతోంది. తప్పిపోయిన వీళ్లంతా కలిసి ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రవేశిస్తారు.

అక్కడ వీరికంటే ఘనులైన పిల్లలు ఉంటారు. దొంగతనం చేయడానికి వచ్చిన వీళ్లకు ఆ పిల్లలు బిర్యాని పెట్టి హౌస్‌ అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత వారి మధ్య ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని