అప్పుడు క్రికెట్‌కు దూరమైనందుకు సంతోషంగానే ఉన్నా: కేఎల్‌ రాహుల్‌ - ‘i have learnt from my mistakes’ –kl rahul ‘hopeful’ about doing the job for india against england
close
Published : 28/07/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు క్రికెట్‌కు దూరమైనందుకు సంతోషంగానే ఉన్నా: కేఎల్‌ రాహుల్‌

(photo: KL Rahul Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత 18 నెలలుగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌.. ఆగష్టులో ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. కాగా,  ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరచి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న రాహుల్‌.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.ఇప్పటికే కౌంటీ ఎలెవన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో శతకం బాది అదరగొట్టాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదురైన పలు సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న  తీరు గురించి రాహుల్‌ మాట్లాడాడు.

‘2018లో జట్టులో స్థానం కోల్పోయా. ఆ సమయంలో నా వైఫల్యాలకు గల కారణాల గురించి కోచ్‌లతో చర్చించా. నేను ఎక్కడ తడబడుతున్నాననే విషయాలను తెలుసుకోవడానికి నా ఆటకు సంబంధించిన చాలా వీడియోలను చూసి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశా. అప్పుడు నేను టెస్టు క్రికెట్‌కు దూరమైనందుకు సంతోషంగానే ఉన్నా. ఎందుకంటే అది నా ఆటలోని తప్పులను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడింది. వైఫల్యాలు అనేవి మనల్ని మరింత బలవంతులుగా మార్చుతాయి. ఆటపై మరింత దృష్టిపెట్టే విధంగా చేస్తాయి. నా విషయంలోనూ  అదే జరిగింది. ప్రశాంతంగా, క్రమశిక్షణతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. నేను నా ఆటను ఎంజాయ్‌ చేస్తా. తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం నాకిష్టం. మరోసారి నాకు మంచి అవకాశం వచ్చింది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషిస్తా’ అని రాహుల్‌ అన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని