Jabardasth బర్నింగ్‌స్టార్‌ ఫైర్‌.. జబర్దస్త్‌లో సందడి చేసిన సంపూర్ణేష్‌బాబు  - jabardasth latest promo 5th august 2021 hyper aadi anasuya immanuel
close
Published : 01/08/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jabardasth బర్నింగ్‌స్టార్‌ ఫైర్‌.. జబర్దస్త్‌లో సందడి చేసిన సంపూర్ణేష్‌బాబు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారంవారం సరికొత్తగా వినోదం పంచుతూ ప్రేక్షకులను అలరించే ‘జబర్దస్త్‌’ వచ్చే వారం రెట్టింపు కామెడీతో సిద్ధమవుతోంది. ప్రతి గురువారం ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఈసారి ‘క్యాలీఫ్లవర్‌’ హీరో సంపూర్ణేశ్‌బాబు పాల్గొని సందడి చేశారు. సినిమాలోని ఓ భారీ డైలాగ్‌ చెప్పి వారెవ్వా అనిపించారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఆది వేసిన పంచులు ఎప్పటిలాగే అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. ఆ తర్వాత రాఘవ, అభి, తాగుబోతు రమేశ్‌ తమదైన స్టైల్‌లో కామెడీ చేసి సందడి చేశారు. చంటి ఈసారి ‘ఐ’ సినిమాలో గెటప్‌ వేసి విక్రమ్‌గా మారాడు. కాగా ఈ పూర్తి ఎపిసోడ్‌ ఆగస్టు 5న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని