Ram charan: కుడోస్‌ ‘గ్రీన్‌కో’.. చరణ్‌ ప్రశంస - kudos to greenko group says ramcharan
close
Published : 17/05/2021 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ram charan: కుడోస్‌ ‘గ్రీన్‌కో’.. చరణ్‌ ప్రశంస

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనాతో పోరులో భాగంగా ఆక్సిజన్‌ కొరతను తీర్చడానికి ప్రముఖ పునరుత్పాదక సంస్థ ‘గ్రీన్‌కో గ్రూప్‌’ ముందడుగు వేసింది. 1000 కాన్సంట్రేటర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయనున్నట్లు ప్రకటించింది. చైనా నుంచి ప్రత్యేక విమానంలో తెప్పించిన 200 కాన్సంట్రేటర్లను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అప్పగించింది. ఈ సందర్భంగా గ్రీన్‌కో సంస్థకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రముఖ కథానాయకుడు రామ్‌ చరణ్‌ స్పందిస్తూ ‘ప్రభుత్వానికి 1000కి పైగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందిస్తున్న నా స్నేహితుడి సంస్థ గ్రీన్‌కో గ్రూపునకు కుడోస్‌. కరోనా సవాల్‌ విసురుతున్న ఇలాంటి కష్ట సమయాల్లో దేశంలోని ప్రభుత్వాసుపత్రులకు సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించడం గొప్ప విషయం’ అని చరణ్‌ ట్వీట్‌ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని