Sonusood: ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెల్లూరు చేరింది - oxygen plant has reached nellore says sonusood
close
Updated : 06/07/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonusood: ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెల్లూరు చేరింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూసూద్‌ ప్రకటించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెల్లూరుకు చేరుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సోనూ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నా అన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో చలించిపోయిన సోనూసూద్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు పూనుకున్నారు. ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్‌ తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితులకు చేయూతనందించేందుకు నిర్ణయించుకున్నారు. వలస కార్మికులను సొంతగూటికి చేర్చడం దగ్గర మొదలైన సోనూ సేవా ప్రయాణం ఆక్సిజన్‌ ప్లాంట్‌ల ఏర్పాటు.. ఐఏఎస్‌ శిక్షణ.. ఇలా ఎన్నో విధాలుగా దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. నెల్లూరు జిల్లా మీకు రుణపడి ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

‘‘ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెల్లూరుకు చేరుకోవడం సంతోషంగా ఉంది. ఆక్సిజన్‌ ప్లాంట్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. నేను ఎంతగానో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నా’’ అని సోనూసూద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని