రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్‌ - ‌rajinikanth latest still from annaatthe set goes viral‌
close
Published : 12/04/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్: సూసర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. గత డిసెంబరులో రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సినిమా షూటింగ్‌ని తిరిగి హైదరాబాద్‌లో ప్రారంభించారు. తాజాగా సినిమా షూటింగ్‌ సంబంధించిన వర్కింగ్‌ స్టిల్‌ని నిర్మాణ సంస్థ తన ట్వీటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. హైదరాబాద్‌, చెన్నైలలో షూటింగ్‌ జరుపుకున్న తర్వాత కొన్ని సన్నివేశాలను కోల్‌కత్తాలోనూ చిత్రీకరించనున్నారని సమాచారం. చిత్ర కథానాయిక నయనతార ప్రస్తుతం కొచ్చిలో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్‌ రజనీకాంత్‌తో కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే. నవంబర్‌ 4, 2021న సినిమాని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని