లాక్‌డౌన్ మేం కోరుకోవడంలేదు.. కానీ!: ఉద్ధవ్ - ‌uddhav thackeray comments on maharashtra lockdown
close
Published : 01/03/2021 18:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్ మేం కోరుకోవడంలేదు.. కానీ!: ఉద్ధవ్

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటంతో మళ్లీ అక్కడ లాక్‌డౌన్‌ విధిస్తారా? అనే చర్చ కొనసాగుతున్న వేళ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. లాక్‌డౌన్‌ విధించే అంశంపై ఆయన నిరాసక్తత వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ విధించాలని తాము కోరుకోవడంలేదని, కానీ నిస్సహాయ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలంతా విధిగా మాస్క్‌లు ధరించి లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. 

పెట్రోల్‌ సెంచరీలు చూస్తున్నాం..

దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపైనా సీఎం స్పందించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పైపైకి పోతున్నాయన్నారు. గతంలో విరాట్‌ కొహ్లీ, సచిన్‌ తెందుల్కర్‌ శతకాలు చూశాం.. కానీ ఇప్పుడు పెట్రోల్‌ డీజిల్‌ సెంచరీ చూస్తున్నామంటూ ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు.

గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ఎనిమిది వేలకు పైగా కొత్త కేసులు నమోదుతుండటం కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్క రోజే రాష్ట్రంలో 8293 కొత్త కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు, మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 52,154మంది కొవిడ్‌తో మరణించారు. మరోవైపు, రాష్ట్రంలో రికవరీ రేటు 93.95శాతం ఉండగా.. మరణాల రేటు 2.42శాతంగా ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని