Cinema news: #RAPO19 రామ్‌ సరసన మరో ముద్దుగుమ్మ.. - welcoming talented actress akshara gowda onboard for rapo19
close
Published : 31/07/2021 23:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: #RAPO19 రామ్‌ సరసన మరో ముద్దుగుమ్మ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌, కృతిశెట్టి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లింగుస్వామి రూపొందిస్తున్న ఈ సినిమాలో మరో నటి సందడి చేయబోతోంది. మన్మథుడు2, తుపాకీ వంటి చిత్రాల్లో   కనిపించి సందడి చేసిన అక్షరగౌడ ఇప్పుడు రామ్ సరసన అలరించేందుకు సిద్ధమవుతోంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ చిన్నది తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది.

కాగా.. ఇటీవల వరుస హిట్లు కొడుతూ ఫుల్‌జోష్‌తో ఉన్నాడు హీరో రామ్‌. మరోవైపు కృతిశెట్టి సైతం తొలి సినిమా ‘ఉప్పెన’ రూపంలో బ్లాక్‌బస్టర్‌ విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌, కృతి జంటగా #RAPO19 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ జులై 12న ప్రారంభమైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా త్వరలోనే అక్షర గౌడ సెట్లో అడుగుపెట్టనుంది. మరి ఈ సినిమాలో అతిథిగా కనిపించనుందా.. లేక ఫుల్‌లెంగ్త్‌ పాత్ర పోషిస్తుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.


 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని