జర్మనీలోనూ ఆమెకే: 101ఏళ్ల మహిళకు తొలి టీకా - 101 year old woman receives first COVID vaccine in Germany
close
Published : 27/12/2020 22:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జర్మనీలోనూ ఆమెకే: 101ఏళ్ల మహిళకు తొలి టీకా

బెర్లిన్‌: బ్రిటన్‌, అమెరికా, కెనడాల మాదిరిగానే..ఓ 101 ఏళ్ల మహిళ, కొవిడ్‌ నిరోధక వ్యాక్సిన్‌ తీసుకున్న తొలి వ్యక్తిగా జర్మనీలో చరిత్ర సృష్టించారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ శనివారం ఆమెకు కరోనా టీకా వేసారు. ఎడిత్‌ క్వోయిజల్లా అనే ఈ వృద్ధురాలు సాక్సనీ అనహాల్ట్‌ రాష్ట్రంలోని ఓ వయోవృద్దుల సంరక్షణా కేంద్రంలో ఉంటారు. జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్‌ స్పాన్‌ ఈ సందర్భాన్ని ఆశాజనకమైనదిగా అభివర్ణించారు. తమ ప్రజల ప్రాణాలను రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్‌  కీలకమని మంత్రి అన్నారు. అయితే ఇది దీర్ఘకాలం కొనసాగే ప్రక్రియ అని.. అంతవరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

కరోనా వ్యాప్తి తొలి దశ ప్రభావం జర్మనీపై అంతగా పడలేదు. ఐతే మహమ్మారి రెండో సారి విజృంభణతో ఆ దేశం కుదేలైంది. గడచిన 24 గంటల్లో అక్కడ 14 వేలకు పైగా  కొత్త కేసులు, 240 మరణాలు నమోదయ్యాయి. దీనితో ఆ దేశంలో మహమ్మారి వల్ల ప్రాణం కోల్పోయిన వారి సంఖ్య 29,422కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కరోనాపై విజయానికి నాందిగా భావిస్తున్నారు. కాగా, ఇటీవల తలెత్తిన కొత్త రకం కొవిడ్‌ వైరస్‌పై తమ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని జర్మనీ ఔషధ సంస్థ బయోఎన్‌టెక్‌ ధీమా వ్యక్తం చేయటం గమనార్హం.

ఇవీ చదవండి..

భారత్‌లో ఈ టీకాకే తొలి అనుమతి?

కొత్త కరోనా.. అమెరికా అప్రమత్తం  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని