భారత్‌లో 102కు చేరిన కరోనా కొత్తరకం కేసులు - 102 cases of new uk coronavirus strain detected in india so far: centre
close
Published : 13/01/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 102కు చేరిన కరోనా కొత్తరకం కేసులు

దిల్లీ: భారత్‌లో కొత్తరకం కరోనా(యూకే స్ట్రెయిన్‌) కేసుల సంఖ్య 102కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. జనవరి 11న 96గా ఉన్న ఈ సంఖ్య బుధవారానికి 102గా మారింది. పాజిటివ్‌ వచ్చిన వారందర్నీ ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గదిలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపింది. వారి సహ ప్రయాణీకులు, వారిని కలిసిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వీరి నమూనాలపై జన్యుపరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని చాలా కీలకంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. దీనిపై పర్యవేక్షణ, టెస్టులు చేయడం, శాంపిల్స్‌ను ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సోర్టియం ల్యాబులకు పంపడంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. భారత్‌లోనే కాకుండా ఈ యూకే స్ట్రెయిన్‌ డెన్మార్క్‌, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, కెనెడా, జపాన్‌, లెబనాన్‌, సింగపూర్‌లకు కూడా వ్యాపించింది. సాధారణ కరోనా వైరస్‌ కంటే త్వరితంగా వ్యాప్తి చెందే ఈ యూకే స్ట్రెయిన్‌ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత నెలకొంది.

ఇవీ చదవండి..

68ఏళ్ల తర్వాత అమెరికాలో..

హతవిధి.. ట్రంప్‌ పరిస్థితి..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని