అపార్ట్‌మెంట్‌లో పార్టీ: 103 మందికి కరోనా - 103 test positive for covid-19 in bengaluru apartment after a party
close
Published : 16/02/2021 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అపార్ట్‌మెంట్‌లో పార్టీ: 103 మందికి కరోనా

బెంగళూరు: అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వారిలో 103 మంది కరోనా పాజిటివ్‌గా తేలిన ఘటన బెంగళూరులోని బొమ్మనహళ్లిలో జరిగింది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 4న బొమ్మనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో అపార్ట్‌మెంట్‌వాసులందరూ పాల్గొన్నారు. అనంతరం వారిలో కొందరు దేహ్రాదూన్‌ ట్రిప్‌కు వెళ్లేందుకుగానూ కరోనా టెస్టులు చేయించుకున్నారు. వారి టెస్టు ఫలితాలు ఫిబ్రవరి 10న వచ్చాయి. వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే అప్రమత్తమై అపార్టుమెంట్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంటు వారికి సమాచారమిచ్చారు. వారు బీబీఎంపీ అధికారులను సంప్రదించి అపార్టుమెంటువాసులందరికీ కరోనా టెస్టులు చేయించారు. ఆ అపార్టుమెంటులో ఉన్న 1,052 మందికి టెస్టులు చేయగా వారిలో 103 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వారిలో 96 మంది అరవై ఏళ్లకు పైబడిన వారేనని బీబీఎంపీ కమిషనర్‌ మంజునాథ్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చేరగా మిగతా వారిని ఐసోలేషన్‌లో ఉంచామని ఆయన తెలిపారు. అపార్ట్‌మెంటులో ఉన్న అందర్నీ క్వారంటైన్‌లో ఉంచామన్నారు.

పాజిటివ్‌ వచ్చిన వారిలో చాలామందికి లక్షణాలు లేవని బీబీఎంసీ అదనపు కమిషనర్‌ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ నియమాల మేరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. అపార్ట్‌మెంట్‌ నిర్వాసితులకు అవసరమైన అన్ని వస్తువులను వారికి అందిస్తామని ఆయన తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఏవైనా కరోనా వేరియంట్లు ఉంటే గుర్తించేందుకు అందరి నమూనాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, న్యూరో సైన్సెస్‌(నింహాన్స్‌)కు పంపామని అధికారులు వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని