మహమ్మారిని జయించిన 106 ఏళ్ల బామ్మ - 106 Year Old Woman overcomes COVID 19
close
Published : 20/09/2020 23:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహమ్మారిని జయించిన 106 ఏళ్ల బామ్మ

ముంబయి: 106 ఏళ్ల ఓ బామ్మ కరోనాను జయించింది. కొవిడ్‌ సోకడంతో ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు పది రోజులపాటు మహమ్మారితో యుద్ధం చేసి కోలుకుంది. ఈ సందర్భంగా వైద్యబృందం ఆమెకు ఘనంగా ఫేర్‌వెల్‌ పలికారు. మహారాష్ట్రలోని డోంబివిలికి చెందిన వృద్ధురాలికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అయితే వయసు దృష్ట్యా చేర్చుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి. చివరకు డోంబివిలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన క్యాంపులో వృద్ధురాలికి  చికిత్స అందించారు. పది రోజుల అనంతరం బామ్మ కోలుకుంది. ఈ సందర్భంగా బామ్మ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ఆమె మనవరాలు ఆసుపత్రి వర్గానికి, వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపింది.
డోంబివిలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన క్యాంపులో ఒక్క రూపాయికే కరోనా వైద్యం అందిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా క్యాంపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.రాహుల్‌ ఘులే మాట్లాడుతూ.. ‘ఒక్క రూపాయి క్లినిక్‌’ ద్వారా ఇప్పటివరకు 1100 మందికి వైద్యం అందించినట్లు తెలిపారు. బామ్మ కోలుకోవడంలో ప్రత్యేక దృష్టి వహించిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని