Bull Attack: 11 నెలల తర్వాత అతడికి కొత్త ముఖం - 11 months after bull attack man gets new face thanks to series of surgeries
close
Published : 04/08/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bull Attack: 11 నెలల తర్వాత అతడికి కొత్త ముఖం

బికనీర్‌: రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన కర్నీ బిష్ణోయ్‌(38)ను విధి వెక్కిరించింది. గుంపుగా వెళుతున్న అడవి దున్నలకు దారి ఇవ్వడమే అతడికి శాపమైంది. కర్నీ బిష్ణోయ్‌ ఎఫ్‌జీసీ కంపెనీలో ఆపరేటింగ్‌ హెడ్‌గా విధులు నిర్వహిస్తుస్తున్నాడు. ఏదో పనిమీద మిత్రుడితో కలిసి గతేడాది సెప్టెంబర్‌లో అడవి మార్గం గుండా కారులో బయలు దేరాడు. అదే సమయంలో అడవి దున్నల గుంపు రోడ్డు దాటుతోంది. వాటిని చూసిన బిష్ణోయ్‌ అవి వెళ్లేదాక కారును రోడ్డు పక్కనే ఆపాడు. ఆ సమయంలో కారు గ్లాసును అతడు కిందకు దించుకొనే ఉన్నాడు.

అయితే అకస్మాత్తుగా కారు వద్దకు వచ్చిన ఓ దున్న అతడిపై దాడికి పాల్పడింది. కొమ్మలను కారులోపలికి దూర్చి తీవ్రంగా గాయపర్చింది. అంతటితో ఆగకుండా కొమ్ములతోనే బిష్ణోయ్‌ను బయటకు లాగి కిందపడేసింది. ఈ దాడిలో బిష్ణోయ్ ముఖంలోని కుడి భాగం ఛిద్రమైపోయింది. తన కుడి కంటిని పోగొట్టుకున్నాడు. ముక్కు, పెదాలు, తలపై తీవ్ర గాయాలయ్యాయి. అతడి వెంట ఉన్న మిత్రుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడే బిష్ణోయ్‌ను బికనీర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం దిల్లీకి తరలించారు.

బిష్ణోయ్‌ గాయాలను చూసిన దిల్లీ వైద్యులు నిర్ఘాంతపోయారు. ఇంతటి తీవ్ర గాయాలతో అతడు ఎలా బతికున్నాడని ఆశ్చర్యపోయారు. ప్లాస్టిక్‌ సర్జరీ చేసేందుకు నిపుణులను రప్పించారు. కొన్ని గంటలపాటు శ్రమించి బిష్ణోయ్‌కు మొదటి దశ ప్లాస్టిక్‌ సర్జరీ నిర్వహించారు. నాలుగు నెలల అనంతరం రెండో దశ సర్జరీ చేశారు. ఈ సర్జరీలో దేశంలో ఇప్పటివరకు వినియోగించని కొత్తరకం నైపుణ్యాన్ని వైద్యులు ఉపయోగించారు. గత జులై నుంచి బిష్ణోయ్‌ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ముఖం మొత్తం మారిపోయింది. కొద్ది రోజుల్లో మరికొన్ని సర్జరీలు చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని