11 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింహా’ గర్జన    - 11 years completed nbk simha move
close
Updated : 01/05/2021 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

11 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింహా’ గర్జన   

ఇంటర్నెట్‌ డెస్క్: ‘‘చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావ్...’’ అంటూ ‘సింహా’ చిత్రంలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సింహా’. యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరిటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకి కొరటాల శివ రాసిన డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. సరిగ్గా 11 ఏళ్ల కిత్రం ఏప్రిల్‌ 30,  2010న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ఇందులో నయనతార ప్రధాన కథానాయికగా నటించగా స్నేహ ఉల్లాల్, నమితలు నాయికలుగా అలరించారు. చిత్రానికి భాస్కరభట్ల, చంద్రబోస్‌ సాహిత్యం అందించగా చక్రి స్వరాలు సమకూర్చారు. ‘‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే..’’, ‘‘బంగారుకొండ మరుమల్లెదండ..’’ అంటూ సాగే పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. అందులో డాక్టర్‌ నరసింహా కాగా మరొకటి లెక్చరర్‌  శ్రీమన్నారాయణగా నటించి మెప్పించారు. ఇందులో సాయి కుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. బోయపాటి శ్రీను-బాలకృష్ణతో కలిసి చేసిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా తర్వాత 2014లో మరోసారి ‘లెజెండ్‌’తో విజయం సాధించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా వస్తున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ 50 మిలియన్లకుపైగా వ్యూస్‌ని సాధించించి అభిమానులను ఆకట్టుకుంటోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని