అక్టోబరులో 11.55 లక్షల కొత్త ఉద్యోగాలు: ఈపీఎఫ్‌ఓ - 11.55 lakh new jobs in October EPFO
close
Published : 21/12/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్టోబరులో 11.55 లక్షల కొత్త ఉద్యోగాలు: ఈపీఎఫ్‌ఓ

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ఒకవైపు వేధిస్తున్నా సంఘటిత రంగంలో గత అక్టోబరులో 11.55 లక్షల నికర ఉద్యోగాల సృష్టి జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో లభించిన 7.39 లక్షల ఉద్యోగాలతో పోలిస్తే ఇవి 56 శాతం అధికమని పేర్కొంది. 18-25 ఏళ్ల యువతే అధికంగా (50 శాతం) ఈ కొత్త ఉద్యోగాలు పొందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 2020 సెప్టెంబరులో నమోదైన 14.19 లక్షల నికర ఉద్యోగాలతో పోలిస్తే మాత్రం అక్టోబరులో తగ్గాయని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో నికర కొత్త ఉద్యోగాలు 78.58 లక్షలకు చేరాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇవి 61.12 లక్షలుగా నమోదయ్యాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌లో నికరంగా 1,79,685 మంది, మేలో 1,43,540 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయినప్పటికీ, 2020 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య కాలంలో సుమారు 39.33 లక్షల మందికి నికరంగా ఉద్యోగాలు లభించడం విశేషం.
* ఇందులో రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, హరియాణాల్లోనే (53 శాతం) ఉద్యోగాలు అధికంగా లభించాయి. పరిశ్రమ ఆధారంగా చూస్తే ‘నిపుణుల సేవలు’ విభాగంలో 60 శాతం రికవరీ కనిపించింది.
* 2020లో కొత్తగా 2.08 లక్షల మంది మహిళలు ఉద్యోగాలు పొందారు. అక్టోబరులో నమోదైన 11.55 నికర ఉద్యోగాల్లో వీరి వాటా 21 శాతమే.
* 2017 సెప్టెంబరు-2020 అక్టోబరు మధ్య కాలంలో నికరంగా 1.94 కోట్ల మంది చందాదారులు జతయ్యారని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని