తమన్నా ‘11th అవర్‌’ టీజర్‌ చూసేయండి! - 11th hour teaser
close
Updated : 29/03/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్నా ‘11th అవర్‌’ టీజర్‌ చూసేయండి!

హైదరాబాద్‌: తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘11th అవర్‌’. మగవాళ్ల వ్యాపార సామ్రాజ్యంలో ఒక మహిళ ప్రవేశించి వారిని దీటుగా ఎలా ఎదుర్కొందనేది చిత్ర నేపథ్యంగా టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో తమన్నా ‘అరాత్రికారెడ్డి’ అనే పాత్రలో కనిపించనుంది. ‘చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు, సృష్టించుకోవాల్సి ఉంటుంది’ అంటూ ఆమె చెబుతున్న డైలాగ్స్‌ కార్పోరేట్ వ్యాపార సామ్రాజ్యాల్లో ఉండే మైండ్‌గేమ్‌ సినిమాలా కనిపిస్తోంది.

వంశీ కృష్ణ, అరుణ్‌ అదిత్‌, శత్రు, పవిత్రాలోకేష్‌, జయప్రకాశ్‌ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఏప్రిల్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరోవైపు తమన్నా గోపిచంద్‌ సరసన నటించిన ‘సీటీమార్‌’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని