పుష్కరకాలం పూర్తి చేసుకున్న రవితేజ ‘కిక్‌’ - 12 years completed ravi teja kick‌ movie
close
Updated : 09/05/2021 09:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుష్కరకాలం పూర్తి చేసుకున్న రవితేజ ‘కిక్‌’

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కిక్‌’.  ఇలియానా కథానాయిక. యాక్షన్ కామెడీగా తెరపైకి వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. వక్కంతం వంశీ కథ అందించగా అబ్బూరి రవి రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. మే 8, 2009లో విడుదులైన ఈ సినిమా నేటికి  పుష్కరకాలం పూర్తి చేసుకుంది. చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూర్చగా రసూల్ ఎల్లోర్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇందులో కోట శ్రీనివాసరావు, కిక్‌ శ్యామ్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రావు రమేష్‌, అలీతో పాటు పలువురు హాస్యనటులు ఇందులో నవ్వులు పూయించారు.

సినిమా కథేంటంటే కళ్యాణ్ (రవితేజ) చదువుకున్న కుర్రాడు. మంచి తెలివైన వాడు. కానీ ఏ ఒక్క ఉద్యోగంలోనూ  కొద్ది రోజులు కూడా పనిచేయడు. తను చేసే ప్రతి పనిలోనూ కిక్ ఉండాలని కోరుకునే వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి నైనా (ఇలియానా) పరిచయం అవుతోంది. ఆ తర్వాత కల్యాణ్ చేసే పనులకి నైనా ఏం చేసింది. వారి మధ్య ప్రేమ సఫలమైందా, విఫలమైందానేది మిగతా కథ. 2009లో విడుదలైన తెలుగు సినిమాల్లో  ‘కిక్‌’ బాగా క్లిక్‌ అయ్యి బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లే సాధించింది. చిత్రంలో ‘I Dont Want Love..’’, ‘మనసే తడిసేలా..’’, ‘గోరె గోరె..’’ అంటూ సాగే పాటలు యువతను మెప్పించాయి. ఈ సినిమాకి సీక్వెల్‌గా 2015లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనే రవితేజ కథానాయకుడిగా ‘కిక్‌ 2’తెరకెక్కింది. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్‌ నటించింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని