పాక్‌లో ఘోర ప్రమాదం - 13 charred to death as bus collides with van in Pakistan
close
Published : 30/11/2020 21:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌లో ఘోర ప్రమాదం

లాహోర్‌: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఓ బస్సు, వ్యాన్‌ పరస్పరం ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. లాహోర్‌కు 75కి.మీల దూరంలోని కలఖతే రోడ్ నారంగ్ మండి వద్ద జరిగిన ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం కాగా.. 17మంది గాయపడ్డారు. పొగమంచు కారణంగా దారి కనబడకపోవడంతో వ్యాన్‌ బస్సును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైందన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి ఉస్మాన్‌ బజ్దార్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని