సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేయండి! - 13500 covid cases in 24 hours in delhi cancel board exams kejriwal
close
Published : 13/04/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేయండి!

కేంద్రాన్ని కోరిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ (10, 12వ తరగతి) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. కరోనా విజృంభణ దృష్ట్యా సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దిల్లీలో 6లక్షల మంది సీబీఎస్‌ పరీక్షలు రాయాల్సి ఉందని.. ఒకవేళ వీటిని నిర్వహిస్తే పరీక్షా కేంద్రాలు కొవిడ్‌ హాట్‌స్పాట్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయం ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

దేశ రాజధానిలో గడిచిన 24గంటల్లో 13,500 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో దాదాపు లక్షమంది సిబ్బంది పాల్గొంటారని.. ఈ సమయంలో విద్యార్థులు, టీచర్లకు కొవిడ్‌ సోకే ప్రమాదం ఉందన్నారు. తప్పనిసరి అనుకుంటే సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని కేంద్రానికి సూచించారు. చాలా దేశాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని..కేంద్ర వీటిపై పునరాలోచించాలన్నారు.

సీబీఎస్‌ఈ 10,12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో దేశంలో కరోనా విజృంభణ మరోసారి మొదలు కావడంతో ఈ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌ ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం దిల్లీలో కరోనా నాలుగో ఉద్ధృతి కొనసాగుతోందని..మునుపటి విజృంభణ కంటే ఇది ప్రమాదకరమైందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీలో కరోనా తీవ్రత దృష్ట్యా అత్యవసరం అనుకుంటేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే లక్షా 61వేల పాజిటివ్‌ కేసులు, 879 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని