భారత్‌లో 150కి చేరిన యూకే స్ట్రెయిన్‌ కేసులు - 150 people infected with uk variant of covid-19 in india: govt
close
Published : 23/01/2021 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో 150కి చేరిన యూకే స్ట్రెయిన్‌ కేసులు

దిల్లీ: భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 150కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్తరకం కరోనా వైరస్‌ సోకిన వారిని ఆయా రాష్ట్రాల్లో ఒకే గదిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేంద్రం గతంలో వెల్లడించింది. వారి సన్నిహితులను కూడా క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వారు తెలిపారు. వారితో కలిసి ప్రయాణించిన వారిని గుర్తిస్తున్నామన్నారు. గత సెప్టెంబరులో బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం వైరస్‌ 70శాతం ఎక్కువగా వ్యాప్తి చెందే స్వభావంతో ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం.. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. యూకే నుంచి వచ్చిన వారి సన్నిహితులు, కుటుంబీకుల నమూనాలను ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియంకు పంపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ యూకే స్ట్రెయిన్‌ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇదే తరహాలో జన్యుమార్పిడి చెందిన దక్షిణాఫ్రికా వేరియంట్‌ వైరస్‌ను ఇప్పటి వరకూ 20 దేశాల్లో గుర్తించారు. ఇది 50శాతం ఎక్కువ త్వరగా వ్యాప్తిచెందుతుందని పరిశోధకులు గుర్తించారు. కాగా మరోవైపు దేశంలో ఎనిమిది రోజులుగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 10లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లుగా ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇవీ చదవండి..

మొదటి 2రోజులు ఇబ్బందిపడ్డాం: ఉపాసన

భారత్‌కు బ్రెజిల్‌ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞతమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని