162 ఆక్సిజన్‌ ప్లాంట్‌లకు ప్రభుత్వం అనుమతి - 162 pressure swing adsorption plants sanctioned to augment medial oxygen govt
close
Published : 18/04/2021 23:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

162 ఆక్సిజన్‌ ప్లాంట్‌లకు ప్రభుత్వం అనుమతి

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది. దీంతో కరోనా బారినపడి ఆక్సిజన్‌ అవసరమైన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పీడనంతో కూడిన 162 మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. సహజమైన గాలిని శుద్ధిచేసి రోగులకు ప్రాణవాయువు (ఆక్సిజన్‌)ను అందించే ఈ పీఎస్‌ఏ పరికరాన్ని రాష్ట్ర ప్రభుత్వాai సూచించిన ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటి సామర్ధ్యం 154.19 మెట్రిక్‌ టన్నులుగా పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లో 5, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4, చండీగఢ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌లో మూడు, బిహార్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రెండేసి, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌; దిల్లీ, హరియాణ, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఒకటి చొప్పున ఈ ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్‌ చివరి నాటికి మరో 59, మే చివరి నాటికి అదనంగా 80 ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, మరో 100 ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వినతలు వచ్చినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

ఇందుకోసం ‘పీఎం-కేర్స్‌’ నిధి నుంచి రూ. 201.58 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఇప్పటికే ప్రకటించింది. వీటిద్వారా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్‌ లభ్యత పెరగడమే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సమయానికి అందుబాటులో ఉంచడానికి కూడా వీలవుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని