దేశవ్యాప్తంగా 19.5 లక్షల మందికి వ్యాక్సిన్‌ - 19.5 lakh healthcare workers vaccinated across the country
close
Published : 25/01/2021 20:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశవ్యాప్తంగా 19.5 లక్షల మందికి వ్యాక్సిన్‌

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో 10వ రోజైన సోమవారం సాయంత్రం 7గంటల వరకూ 19,50,183 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం 35,785 సెంటర్లలో వ్యాక్సిన్‌ను అందించినట్లు వారు వెల్లడించారు. సోమవారం ఒక్క రోజు 3,34,679 మందికి, 7,171 సెంటర్లలో వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. వీరిలో 348 మంది మాత్రం స్వల్ప ఇబ్బందులకు గురయ్యారని వారు తెలిపారు. కాగా భారత్‌లో గడచిన 24 గంటల్లో 13,203 కరోనా కేసులు నమోదయ్యాయి.

జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించారు. కరోనాపై పోరులో ముందుండి పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పోలీసులకు తొలి విడతలో టీకాలను అందిస్తున్నారు. రెండో విడతలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కీలక నేతలకు టీకాలను అందించనున్నారు.

ఇవీ చదవండి..

గణతంత్ర వేడుకలకు యాప్‌

భద్రతా వలయంలో దిల్లీ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని