15 దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా - 22 countries have requested india for supply of covid-19 vaccines
close
Updated : 06/02/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15 దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా

దిల్లీ: భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్లను ఇప్పటి వరకూ 15 దేశాలకు సరఫరా చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం తెలిపారు. పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పొరుగు దేశాలకు సహాయం చేసేందుకు కొన్ని పంపగా, మరొకొన్ని వాణిజ్య ఒప్పందాల మేరకు పంపినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్‌ సహాయం కోరిన దేశాల్లో ఆఫ్గానిస్థాన్‌, అల్జీరియా, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, కువైట్‌, మాల్దీవులు, మారిషస్‌, మొరాకో, మంగోలియా, మయన్మార్‌, నేపాల్‌, ఒమన్‌, సౌదీ అరేబియా, సౌత్‌ ఆఫ్రికా, యూఏఈ, పసిఫిక్‌ ఐస్లాండ్‌ దేశాలు మరికొన్ని ఉన్నాయని ఆయన తెలిపారు. ‘‘మొత్తం 22 దేశాల నుంచి వ్యాక్సిన్‌ కోసం అభ్యర్థనలు వచ్చాయి. వాటిలో 15 దేశాలకు ఇప్పటికే వ్యాక్సిన్లను పంపాం. ఫిబ్రవరి రెండు నాటికి 56 లక్షల డోసులను పొరుగు, కీలక భాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా పంపాం. 105 లక్షల డోసులను వాణిజ్య ఒప్పందాలు చేసుకొని పంపాం’’ అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల పంపిణీ జరుగుతోంది. మార్చి నెలలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలివ్వడం పూర్తవుతుందని మంత్రి తెలిపారు. ఆ వెంటనే యాభై ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందిస్తామని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి..

భారత రక్షణ రంగం బలోపేతం

ఆ 21 గ్రామాల్లో ఒక ఓటర్‌.. రెండు ఓట్లు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని