ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌..‌ ఫొటో వైరల్‌ - 25 years of dabboo Ratnani photographer shared NTR photo goes viral
close
Published : 18/10/2020 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌..‌ ఫొటో వైరల్‌

హైదరాబాద్‌: సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ఆరంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతంలో ప్రముఖుల ఫొటోషూట్‌లో తీసిన స్టిల్స్‌ను ఆదివారం షేర్‌ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌లో ఉన్న అరుదైన చిత్రాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 2018లో ‘అరవింద సమేత’ సినిమా కోసం తారక్‌ ఇలా ఫిట్‌గా తయారయ్యారు. ఆ సమయంలో క్లిక్‌ మనిపించిన ఫొటో అది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోని కొమరం భీమ్‌ పాత్ర కోసం తారక్‌ ఇంకా ఫిట్‌గా సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఇదే సందర్భంగా రత్నానీ సినీ సెలబ్రిటీలు కరీనా కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, అలియా భట్‌, జాన్‌ అబ్రహం, సన్నీ లియోని, పరిణీతి చోప్రా, హృతిక్‌ రోషన్‌ తదితరులతో ఫొటోషూట్‌లో భాగంగా తీసుకున్న చిత్రాల్ని పంచుకున్నారు. అవన్నీ కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రత్నానీ భారత్‌లోనే అగ్ర ఫ్యాషన్‌ ఫొటో గ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. ఆయన పేరుతో క్యాలెండర్లు కూడా ప్రచురితం అవుతుంటాయి. అనేక మ్యాగజైన్లకు కవర్‌ ఫొటో గ్రాఫర్‌గా కూడా పనిచేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు మహేశ్‌ బాబు స్టిల్స్‌ను కూడా క్లిక్‌ మనిపించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని