‘పెళ్లి సందడి’కి పాతికేళ్లు - 25 years to pelli sandadi movie director k raghavendra rao tweet
close
Updated : 12/01/2021 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పెళ్లి సందడి’కి పాతికేళ్లు

దర్శకేంద్రుడి ట్వీట్‌

హైదరాబాద్‌: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినీ అణిముత్యాల్లో ఒకటి ‘పెళ్లిసందడి’ చిత్రం. నటుడు శ్రీకాంత్‌ కెరీర్‌లోనూ అల్‌టైమ్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ చిత్రం విడుదలై 25 ఏళ్లు  పూర్తయిన సందర్భంగా దర్శకేంద్రుడు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు.

‘నేటికి పెళ్లి సందడి సినిమా విడుదలై 25 ఏళ్లు. నా కెరీర్‌, శ్రీకాంత్‌ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, జగదీష్‌ ప్రసాద్‌లకు నమస్కరిస్తున్నాను’అంటూ రాసుకొచ్చారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతిపాట ఒక సెన్సేషన్‌. కీరవాణి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ‘సౌందర్య లహరీ’, ‘మా పెరటి జాంచెట్టు’ పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. హీరోయిన్లు దీప్తి భట్నాగర్‌ అందాలు, రవళి అమాయకపు చూపులు సినిమాకు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి.

ఇవీ చదవండి!

బన్నీ ‘ర్యాప్‌ సాంగ్‌’ రప్ఫాడిస్తోందిగా!

‘అశ్వథ్థామ’గా రాబోతున్న విక్కీ కౌశల్‌ 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని