ANDSF operations: 24 గంటల్లో 254 మంది తాలిబన్ల హతం - 254 taliban terrorists were killed and 97 wounded as a result of andsf operations in afghanistan
close
Published : 02/08/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ANDSF operations: 24 గంటల్లో 254 మంది తాలిబన్ల హతం

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ సైన్యానికి, తాలిబన్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. తాలిబన్లను మట్టుబెట్టేందుకు అఫ్గాన్‌ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఘాంజి, కాందహార్‌, హెరాత్‌, ఫరా, కాబూల్‌, బర్మల్‌తోపాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా గడిచిన 24 గంటల్లో అఫ్గాన్ జాతీయ రక్షణ, భద్రతా దళాలు (ఏఎన్‌డీఎస్‌ఎఫ్‌).. 254 మంది తాలిబన్‌ మిలిటెంట్లను హతమార్చినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కొందరు పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టులు కూడా ఉన్నట్లు తెలిపింది. పోలీసు దాడుల్లో మరో 97 మంది తాలిబన్లు గాయపడినట్లు స్పష్టం చేసింది. ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

ఓవైపు ఏఎన్‌డీఎస్‌ఎఫ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండగా..  కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి రాకెట్ల దాడి జరిగింది. ఈ విషయాన్ని విమానాశ్రయ చీఫ్‌ మసూద్‌ పష్తూన్‌ ధ్రువీకరించారు. రెండు రాకెట్లు రన్‌వేను తాకాయని తెలిపారు. దీంతో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయన్నారు. రన్‌వేను బాగుచేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నాయని పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని