పాక్‌ కాల్పులు.. ముగ్గురు జవాన్లు వీరమరణం - 3 Soldiers Killed In Action In Pak Shelling and 3 Civilians Dead
close
Published : 14/11/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ కాల్పులు.. ముగ్గురు జవాన్లు వీరమరణం

మరో ముగ్గురు పౌరులు మృతి

8 మంది పాక్‌ సైనికుల హతం

శ్రీనగర్‌: పాక్‌ హద్దులు దాటింది. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ముగ్గురు పౌరులు కూడా మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. బారాముల్లోలోని నంబ్లా సెక్టార్‌ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జనాన్లు అమరులయ్యారు. పాక్‌ సైన్యం మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడి చేశారు. హాజీ పీర్‌ సెక్టార్‌లో జరిగిన ఘటనలో ఓ బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీర మరణం పొందగా.. మరో జవాను గాయపడినట్లు అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని యురి ప్రాంతం కామల్‌కోటే సెక్టార్‌లో జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృత్యువాత పడ్డడారు. బాల్కోటే ప్రాంతం హాజీ పీర్‌ సెక్టార్‌లో జరిపిన దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలు ప్రాంతాల్లో జరిపిన దాడిలో పలువురు పౌరులు కూడా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

పాక్‌ బంకర్లను పేల్చివేసిన ఆర్మీ
యురి, హీజీపీర్‌, కమల్‌ కోట్‌, బాలాకోట్‌ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడిన పాక్‌ బలగాలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్‌ బంకర్లు, ఇంధన ట్యాంకులు, లాంచ్‌ ప్యాడ్‌లను భారత ఆర్మీ పేల్చివేసింది. ఈ దాడుల్లో దాదాపు ఎనిమిది మంది పాకిస్థాన్‌ సైనిక సిబ్బంది హతమయ్యారు. వీరిలో పాకిస్థాన్‌ ఆర్మీ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ)కి చెందిన ముగ్గురు కమాండోలు ఉన్నారని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరో 10 నుంచి 12మంది పాకిస్థాన్‌ ఆర్మీ సిబ్బందికి తీవ్ర గాయాలపాలయ్యారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని