మూడు రోజుల పాటు పోలియో డ్రైవ్‌ - 3-day nationwide polio immunisation drive from january 17
close
Updated : 08/01/2021 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు రోజుల పాటు పోలియో డ్రైవ్‌

చెన్నై: జనవరి 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జాతీయ స్థాయిలో ‘ఇమ్యునైజేషన్‌ డ్రైవ్‌ ఫర్‌ పోలియో’ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌  శుక్రవారం తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశ డ్రైరన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలియోకు సంబంధించి దేశంలోని మొత్తం రోగనిరోధక శక్తి స్థాయిని అంచనా వేయడానికి ఇది ఒక అవకాశమన్నారు.

‘దేశ వ్యాప్తంగా కొద్దిరోజుల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఈ క్రమంలో సామరస్యంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. గత సంవత్సరం  కొవిడ్‌-19 సమయంలో  ప్రభుత్వం, సామాజిక సంస్థలు, ఆరోగ్య కార్యకర్తలు మంచి పనితీరును కనబర్చారు. కాగా, భారత్‌లో అత్యధిక స్థాయిలో కరోనా రికవరీ రేటు నమోదైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  2,300 కరోనా పరీక్షా కేంద్రాలున్నాయి. అట్టడుగు స్థాయి వరకూ కూడా వ్యాక్సిన్‌ అందించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి 2న దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లో డ్రైరన్‌ నిర్వహించారు.  ఈ డ్రైరన్‌ ప్రక్రియలో భాగంగా అధిక సంఖ్యలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు శిక్షణ పొందారు’ అని మంత్రి వివరించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని