టీకా ఉత్సవ్‌: ఆ 3 రాష్ట్రాల్లో కోటికి పైనే.. - 3 states has administered more than 1 crore vaccine doses in tika utsav
close
Published : 16/04/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా ఉత్సవ్‌: ఆ 3 రాష్ట్రాల్లో కోటికి పైనే..

దిల్లీ: దేశంలో కరోనా రెండో విజృంభణను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ ‘టీకా ఉత్సవ్‌’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల్లో కలిపి కోటికిపైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఏప్రిల్‌ 11న 29,33,418 డోసులు పంపిణీ జరిగింది. ఏప్రిల్‌ 12న 40 లక్షలు, 13న 26 లక్షలు, 14న 33 లక్షల డోసులు చొప్పున పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో అర్హులైన ప్రజలందరికీ మొత్తంగా 1,28,98,314 డోసుల టీకాను పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

మరోవైపు మహారాష్ట్ర, రాజస్థాన్‌, యూపీలో ఇప్పటివరకు కోటికి పైగా టీకాల పంపిణీ జరిగిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 1,11,19,018 మందికి టీకా వేయగా.. రాజస్థాన్‌లో 1,02,15,471, యూపీలో 1,00,17,650 మందికి వేసినట్టు వివరించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని