నగల దుకాణంలో 31 మందికి కరోనా పాజిటివ్‌ - 31 Employees At Jewellery Store Test corona positive
close
Published : 20/11/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నగల దుకాణంలో 31 మందికి కరోనా పాజిటివ్‌

ఇండోర్‌: ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే 31 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా గత వారం రోజులుగా ఈ దుకాణానికి వచ్చిన ఇతర సిబ్బంది, వినియోగదారులను గుర్తించే పని మొదలు పెట్టినట్టు వారు తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా సూచించారు. ఆభరణాల దుకాణాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రమే షాపు తెరిచేందుకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీపావళి, ధంతేరాస్‌ సందర్బంగా దుకాణాలు వారం రోజులుగా వినియోగదారులతో నిండిపోయాయి. ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్-19 నియమాలకు విరుద్ధంగా వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రజలు మాస్కులు ధరించకుండానే చక్కర్లు కొట్టడం కనిపించింది. ఈ నేపథ్యంలో ఒకే దుకాణంలో ఇంత మంది సిబ్బందికి కొవిడ్‌ సోకిన ఘటన చర్చనీయాంశమైంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని