యూట్యూబ్‌లో ‘అఖండ’ గర్జన - 38 million views for akhanda title roar fire
close
Published : 24/04/2021 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూట్యూబ్‌లో ‘అఖండ’ గర్జన

ఇంటర్నెట్‌ డెస్క్: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్‌ రోర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 38 మిలియన్‌ వ్యూస్‌ని దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కి ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఎన్‌బీకే - బోయపాటిల కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తోన్న ‘అఖండ’లో ప్రజ్ఞా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని