హాస్టల్‌లో 39మంది విద్యార్థులకు కరోనా  - 39 students tested covid-19 positive
close
Published : 23/02/2021 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాస్టల్‌లో 39మంది విద్యార్థులకు కరోనా 

లాతూర్‌: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా లాతూర్‌ నగరంలోని ఓ హాస్టల్‌లో 39మంది విద్యార్థులు, ఐదుగురు ఉద్యోగులకు వైరస్‌ సోకినట్టు అధికారులు వెల్లడించారు. వసతిగృహంలో ఉండే 360 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించగా.. వారిలో 39మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు లాతూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైద్యశాఖ అధికారి మహేశ్‌ పాటిల్‌ వెల్లడించారు. వైరస్‌ బారిన పడిన విద్యార్థులందరూ తొమ్మిది, పదో తరగతికి చెందినవారేనన్నారు.

ఈ వసతి గృహంలో 60మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని, వీరిలో 30మందిని కొవిడ్‌ పరీక్షలకు పంపగా.. ఐదుగురిలో వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయని చెప్పారు. ఇంకా కొందరి నివేదికలు రావాల్సి ఉందని చెప్పారు. హాస్టల్‌లో ఓ బాలికకు కొవిడ్‌ సోకగా.. ఆమెతో పాటు గదిలో కలిసి ఉండే 13మందికి వైరస్‌ సోకడంతో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు.  వైరస్‌ సోకిన విద్యార్థులు, ఉద్యోగులందరినీ నగర సమీపంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు.

మరోవైపు, మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో కొత్తగా 6218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని