లష్కరే తోయిబా కమాండర్‌ జహిద్‌ టైగర్‌ హతం - 4 militants killed one arrested in separate encounters in J-K
close
Published : 11/10/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లష్కరే తోయిబా కమాండర్‌ జహిద్‌ టైగర్‌ హతం

నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం 

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ టైగర్‌ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. రెండు చోట్ల వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌటర్‌లో జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ముష్కర గ్రూపులకు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అలాగే, ఒక మిలిటెంట్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఘటనా స్థలాల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

కుల్గాం జిల్లాలోని చింగాం వద్ద మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో సైన్యం సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సైనికులపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. అలాగే, దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా దాదూర ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో కూడా ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ నజీర్‌ భట్‌ అలియాస్‌ జహిద్‌ టైగర్‌ హతమైనట్టు ప్రకటించారు. అతడిని మట్టుబెట్టడం సైన్యానికి పెద్ద విజయంగా అభివర్ణించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని