మూడేళ్లలో అమరులైన సైనికులు ఎందరంటే? - 4132 paramilitary die on duty in 3 years MHA
close
Published : 15/09/2020 23:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడేళ్లలో అమరులైన సైనికులు ఎందరంటే?

లోక్‌సభకు వెల్లడించిన కేంద్రమంత్రి

దిల్లీ: దేశ సరిహద్దుల్లో అనునిత్యం పహారా కాస్తూ శత్రు దాడుల్లో అమరులైన పారామిలిటరీ సిబ్బంది వివరాలను కేంద్రం వెల్లడించింది. గత మూడేళ్ల కాలంలో విధి నిర్వహణలో 4వేల మందికి పైగా జవాన్లు మృతిచెందినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఈ విషయాన్ని  లోక్‌సభలో వెల్లడించారు. 2017 నుంచి 2019 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 4,132 మంది పారామిలటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. ఓ సభ్యుడు లిఖితపూర్వంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మృతిచెందిన సైనికుల్లో గెజిటెడ్‌ అధికారులు, సబార్డినేట్‌ అధికారులు, ఇతర ర్యాంకుల సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. మూడేళ్ల కాలంలో అమరులైన మొత్తం జవాన్లలో అత్యధికంగా సీఆర్‌పీఎఫ్‌కు చెందిన వారు 1597 మంది కాగా.. 725 మంది బీఎస్‌ఎఫ్‌, 671 మంది సీఐఎస్‌ఎఫ్, 429 మంది ఐటీబీపీ, 381 మంది ఎస్‌ఎస్‌బీ, 381 మంది అస్సాం రెఫిల్స్‌కు చెందిన వారు ఉన్నట్టు మంత్రి వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని