పాక్‌లో కాల్పులు.. ఐదుగురు పోలీసుల మృతి - 5 Pakistan policemen killed in midnight raid in Gilgit Baltistan
close
Published : 28/07/2020 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌లో కాల్పులు.. ఐదుగురు పోలీసుల మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో దుండగులు జరిపిన కాల్సుల్లో ఐదుగురు పోలీసులు మృతిచెందారు. సోమవారం అర్ధరాత్రి దుండగులు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు.  పీఓకే ప్రాంతం గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా మరో పోలీసు గాయపడ్డట్లు జియో న్యూస్‌ తెలిపింది. ఆ ప్రాంతంలో దుండగులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినవారు ఉగ్రవాదులు కాదని, మారణాయుదాలు సరఫరా చేసే ముఠా అని స్థానిక మంత్రి మిర్‌ అఫ్జల్‌ ఖాన్‌ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని