వారంలో 50 లక్షల ఫోన్లు   విక్రయించాం: ఎమ్‌ఐ ఇండియా - 50 lakh phones sold in a week MI India
close
Published : 24/10/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో 50 లక్షల ఫోన్లు   విక్రయించాం: ఎమ్‌ఐ ఇండియా

దిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఎమ్‌ఐ ఇండియా పండుగ సంబరాల్లో భాగంగా వారంరోజుల్లోనే 50 లక్షల ఫోన్లను విక్రయించినట్లు తెలిపింది. ఇ-కామర్స్‌ పోర్టల్స్‌ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తమ తొలి పండుగ సీజన్‌ విక్రయాల్ని ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించాయి. ‘పండుగ రాయితీలు, ఆఫర్లు ఉండటంతో ఎమ్‌ఐ అభిమానులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్లను 15,000కు పైగా ఉన్న రిటైల్‌ భాగస్వాముల దగ్గర కొనుగోలు చేశారు. 17,000 పిన్‌కోడ్లలో ఉంటున్న వినియోగదార్లకు చేరువ కావడానికి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు తోడుగా ఎమ్‌ఐ.కామ్‌ కూడా సహాయపడింద’ని కంపెనీ తెలిపింది. తమకున్న 15,000కు పైగా రిటైల్‌ భాగస్వాముల దగ్గర వార్షిక ప్రాతిపదికన పండుగ విక్రయాలు రెండింతలు అయ్యాయని పేర్కొంది. ‘5 మిలియన్‌ మార్కు అనేది మా వినియోగదార్లకు మా మీద ఉన్న నమ్మకానికి సాక్ష్యం. నమ్మకమైన ధర, నాణ్యతతో కూడిన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా ఎమ్‌ఐ ఇండియా పని చేస్తోంద’ని ఎమ్‌ఐ ఇండియా చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రఘురెడ్డి వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని