టీ20లకు 50% మంది అభిమానులే - 50 per cent crowd allowed for india-england t20i series gca
close
Published : 12/03/2021 16:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీ20లకు 50% మంది అభిమానులే

అహ్మదాబాద్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ టీ20 సిరీసుకు 50% మంది అభిమానులను అనుమతిస్తున్నామని గుజరాత్‌ క్రికెట్ ‌సంఘం (జీసీఏ) తెలిపింది. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టేడియం మొత్తాన్ని శానిటైజేషన్‌ చేయించామని పేర్కొంది. కరోనా ఆంక్షలు, నిబంధనలు అమలు చేసేందుకు కార్యదళాల్ని నియమించామని వెల్లడించింది. రెండు జట్లు శుక్రవారమే మొదటి మ్యాచులో తలపడుతున్న సంగతి తెలిసిందే.

‘కొవిడ్‌-19 వల్ల నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ టీ20 మ్యాచులకు స్టేడియం సామర్థ్యంలో 50% వరకే అభిమానులను అనుమతిస్తున్నాం. అభిమానుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేడియం మొత్తం శానిటైజ్‌ చేయించాం. కొవిడ్‌-19 నిబంధనలను కఠినంగా పాటిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక కార్యదళాల్ని నియమించాం. ఆంక్షలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం, పాటించేలా చూడటం వీరి బాధ్యత’ అని జీసీఏ ఉపాధ్యక్షుడు ధన్‌రాజ్‌ నత్వాని తెలిపారు.

మొదటి టీ20 పోరుకు ఇంగ్లాండ్‌, భారత్‌ సిద్ధమయ్యాయి. రెండు జట్లలోనూ మంచి హిట్టర్లు ఉండటం, పిచ్‌ ఫ్లాట్‌గా ఉండటంతో పరుగుల వరద పారుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచకప్‌ కోసం కీలక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం, మేళవింపును సమకూర్చుకోవడం కోసం కోహ్లీసేన ప్రయత్నిస్తోంది. మొతేరాలో అనుభవం సంపాదించి దానిని ప్రపంచకప్‌లో వాడుకోవాలని మోర్గాన్‌ బృందం ఆలోచన.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని