Vaccination: దేశంలో సగం మందికి మొదటి డోసు టీకా పూర్తి! - 50 percent adults in india have got at least one vaccine dose
close
Published : 28/08/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccination: దేశంలో సగం మందికి మొదటి డోసు టీకా పూర్తి!

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న వయోజన జనాభాలో సగం మందికి కొవిడ్‌ మొదటి డోసు వ్యాక్సిన్‌ పూర్తయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ ఏడాది మొదట్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవగా.. ఇప్పటివరకు 61కోట్ల డోసుల టీకా పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకుంటూ.. ఇది ఒక అపూర్వమైన దీనిని ఓ మైలురాయిగా అభివర్ణించారు.

‘వైరస్ బారిన పడకుండా టీకా వేసుకుని రక్షణ పొందే వారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరుగుతోంది. ఇది ఒక అపూర్వమైన మైలురాయి. దేశ వయోజన జనాభాలో దాదాపు 50 శాతం మంది కొవిడ్‌ మొదటి డోసు తీసుకున్నారు. ఇది ఇలానే కొనసాగించండి’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గురువారం నాటికి టీకా పంపిణీ ప్రక్రియ 61 కోట్ల డోసులు దాటింది. గత 24 గంటల్లో సుమారు 80 లక్షల డోసుల టీకాలను వేశారు. జాన్స్ హాప్‌కిన్స్ అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో చైనా ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది.

థర్డ్‌ వేవ్‌ ముప్పు దృష్ట్యా వచ్చే డిసెంబరు నాటికి దేశ జనాభాలో 60 శాతం మందికి టీకా పూర్తి చేయాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం దేశవ్యాప్తంగా రోజుకు 10.9 మిలియన్ల డోసులను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని