కరోనా విజృంభిస్తుంటే పెళ్లికి 700 మంది అతిథులు - 700 people attend wedding in maha organisers booked
close
Updated : 12/03/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా విజృంభిస్తుంటే పెళ్లికి 700 మంది అతిథులు

ఠాణే: గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ గత కొన్నిరోజులుగా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఓ వైపు మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్నా.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలకు గాలికొదిలేస్తూ వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఠాణే జిల్లాలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకే ఇందుకు నిదర్శనం. కల్యాణ్‌ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లికి ఏకంగా 700 మంది అతిథులు వచ్చారు.

మార్చి 10న తూర్పు కల్యాణ్‌ ప్రాంతంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు చాలా మంది హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అక్కడికి వెళ్లి చూశారు. దాదాపు 700 మంది మండపంలో ఉన్నట్లు గుర్తించారు. పైగా అందులో ఎవరూ మాస్క్‌ పెట్టుకోకపోవడం గమనార్హం. దీంతో సదరు వేడుక నిర్వాహకులపై అధికారులు కేసు నమోదు చేశారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలో వివాహ వేడుకలకు కేవలం 50 మందిని మాత్రమే ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ రికార్డు స్థాయిలో 14వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నాగ్‌పూర్‌ ప్రాంతంలో ఈ నెల 15 నుంచి వారం పాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించగా.. పుణె, నాందేడ్‌ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. మరోవైపు కరోనా దృష్ట్యా ఈ నెల 14న జరగాల్సిన మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలను మార్చి 21కి వాయిదా వేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని