ప్రధాని 70వ పుట్టిన రోజు.. 70 వేల మొక్కలు  - 70000 trees for PM Narendra Modi’s 70th birthday
close
Published : 15/09/2020 23:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రధాని 70వ పుట్టిన రోజు.. 70 వేల మొక్కలు 

పచ్చదనం పెంపునకు సూరత్‌ డిప్యూటీ మేయర్‌ కృషి

సూరత్‌: సూరత్‌కు చెందిన డిప్యూటీ మేయర్‌ నీరవ్‌ షా పచ్చదనం పెంపులో భాగంగా మొక్కల నాటడంపై దృష్టి పెట్టారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ 70వ జన్మదినం జరుపుకోనున్నారు. అప్పటికల్లా 70 వేల మొక్కలు నాటాలని నిశ్చయించారు. సెప్టెంబరు 6న ప్రారంభించిన ఈ మొక్కలు నాటే కార్యక్రమం 17 వరకూ జరగనుంది. సూరత్‌ పరిశుభ్రంగా, మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండటమే తన లక్ష్యమని నీరవ్‌ చెబుతున్నారు. ప్రజలకు జీవవైవిధ్యం గురించి వివరించాలనే ఉద్దేశంతోనే తాను మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.

దీంతో పాటు సూరత్‌ జనాభాకు సమానంగా మొక్కలు ఉండాలనేది తన ఆశయం అని వివరించారు. ప్రస్తుతం పెరుగుతున్న వాహనాల రాకపోకలు, పరిశ్రమల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. దీన్ని నియంత్రించటానికి మన వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం చెట్లే అని ఆయన తెలిపారు. హరిత భారతదేశం వైపు ప్రజలు అడుగు వేయటం కోసం నీరవ్‌షా దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇతను కాలుష్య నివారణకు కృషి చేయటమే కాక ప్రకృతికి తన వంతు సాయం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని