ఆ 75 మంది ఆచూకీ ఎక్కడ? - 75 uk returnees to be traced in karnataka says minister
close
Published : 01/01/2021 18:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ 75 మంది ఆచూకీ ఎక్కడ?

యూకే నుంచి వచ్చిన త్వరలోనే గుర్తిస్తాం 
కర్ణాటక మంత్రి కె.సుధాకర్‌

బెంగళూరు: దేశంలో కొత్త రకం కరోనా కలవరం కొనసాగుతోంది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇంకా 75మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కర్ణాటక  ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. త్వరలోనే వారిని గుర్తిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. యూకే నుంచి వచ్చిన వారిలో ఏడుగురిలో కొత్త స్ట్రెయిన్‌ ఉన్నట్టు తేలిందని, ఇంకా 31మంది నివేదికలు రావాల్సి ఉందని ఆయన విలేకర్లతో పేర్కొన్నారు. యూకే నుంచి వచ్చిన వారిలో మరో 75 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారని, వారి లోకల్‌ కాంటాక్టు నంబర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు. అందరినీ త్వరలోనే గుర్తించి పరీక్షలు చేయించేందుకు రాష్ట్ర హోంశాఖ భరోసా ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ 75మందిలో 70 మంది బెంగళూరు నగర కార్పొరేషన్‌ పరిధిలోని వారేనన్నారు. 

యూకే నుంచి వచ్చినవారిలో 33 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలగా.. వారిని కలిసిన మరో ఐదుగురితో కలిపి మొత్తంగా 38 కేసులు ఉన్నట్టు తెలిపారు. వీరిలో యూకే స్ట్రెయిన్‌ ఉందో, లేదో నిర్ధారించుకొనేందుకు శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపినట్టు చెప్పారు. ఏడుగురికి కొత్త రకం కరోనా వైరస్‌ సోకినట్టు తేలిందని మంత్రి వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు కర్ణాటకలో మొత్తంగా 10 యూకే స్ట్రెయిన్‌ కేసులు నమోదైనట్టు కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అధికారులు వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. నవంబర్‌ 25 నుంచి యూకే నుంచి కర్ణాటకకు మొత్తంగా 5068 మంది వచ్చారు. వారిలో డిసెంబర్‌ 9నుంచి వచ్చినవారే 4243 మంది ఉన్నారు. ఇందులో 810 మంది ప్రయాణికులు ఇతర రెండు రాష్ట్రాలకు ప్రయాణించినట్టు చెప్పారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని ఆ రెండు రాష్ట్రాలతో పంచుకున్నట్టు మంత్రి వివరించారు.

ఇవీ చదవండి..

భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కేసులు @29

కొవిషీల్డ్‌ టీకాకు గ్రీన్‌సిగ్నల్‌!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని