R-factor: కరోనా సెకండ్‌వేవ్‌ ఇంకా పోలేదు.. ఆ 8 రాష్ట్రాల్లో ఆందోళనకరం! - 8 states show rise in r-factor covid still raging in india says government
close
Published : 03/08/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

R-factor: కరోనా సెకండ్‌వేవ్‌ ఇంకా పోలేదు.. ఆ 8 రాష్ట్రాల్లో ఆందోళనకరం!

కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక

దిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ ఇంకా తొలగిపోలేదని, ఎనిమిది రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఉద్ధృతరూపం కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. కరోనా వ్యాప్తి రేటును తెలియజేసే ఆర్‌- ఫ్యాక్టర్‌  (రీ ప్రొడక్షన్‌ రేటు) 8 రాష్ట్రాల్లో 1 కన్నా ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా పరిస్థితిపై నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు మంగళవారం మాట్లాడారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో గతవారంలో పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదైనట్టు వెల్లడించారు. కేరళ, మహారాష్ట్ర, మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ సహా ఆరు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో గత నాలుగు వారాలుగా రోజువారీ కేసుల పెరుగుదల భారీగా కొనసాగుతోందని తెలిపారు. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో 49.85శాతం ఒక్క కేరళలోనే నమోదయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ మే నెలతో పోలిస్తే జులై నెలలో రెట్టింపు సంఖ్యకన్నా అధికంగా ఉందని పేర్కొన్నారు. 

డెల్టా వేరియంట్‌ ప్రభావంతో కేసులు పెరుగుదల కొనసాగుతోందని నీతిఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ తెలిపారు. దేశంలో డెల్టా వేరియంట్‌ ఓ ప్రధానమైన సమస్యగా మారిందన్నారు. ఆర్‌ ఫ్యాక్టర్‌ పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. R నంబర్‌ 0.6 లేదా అంతకన్నా తక్కువగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ నంబర్‌ 1 కన్నా అధికంగా ఉంటే వైరస్‌ వ్యాప్తి మరింతగా ఉండే అవకాశం ఉందనేందుకు సూచిక అన్నారు. హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌, లక్షద్వీప్‌, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలో ఆర్‌ ఫ్యాక్టర్‌ 1కన్నాఎక్కువగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో కేసుల తగ్గుదల ట్రెండ్‌ కనబడుతోందని, అలాగే, బెంగాల్‌, నాగాలాండ్‌, హరియాణా, గోవా, దిల్లీ, జార్ఖండ్‌లలో మాత్రం  ఆర్‌ ఫ్యాక్టర్‌ 1గా ఉన్నట్టు తెలిపారు. 

ఆర్‌ నంబర్‌ 1కన్నా ఎక్కువగా ఉంటే.. కేసుల సంఖ్య పెరుగుతోందని, నియంత్రించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్‌లలో ఆర్‌ ఫ్యాక్టర్‌ నంబర్‌ సగటున 1.2గా ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ రోజుకు దాదాపు 4.7లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని