India: 80% పల్లెలు వైద్యానికి దూరం - 80 percent villages suffer lack of medical support
close
Updated : 22/05/2021 10:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India: 80% పల్లెలు వైద్యానికి దూరం

మిషన్‌ అంత్యోదయ సర్వేలో వెల్లడి 

ఈనాడు, దిల్లీ:  పల్లెలే దేశానికి పట్టుగొమ్మలంటూ ప్రభుత్వాలు ఘనంగా చెబుతున్నా గ్రామాల్లో అది ప్రతిబింబించడంలేదు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన మిషన్‌ అంత్యోదయ సర్వే-2019ని పరిశీలిస్తే ఈ అంశం స్పష్టమవుతోంది. దాదాపు 80%కిపైగా గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేవని తేలింది. 6% గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 14.5% గ్రామాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు, 23.5% గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు, 11.5% గ్రామాల్లో మాత్రమే జన ఔషధీ కేంద్రాలు ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న 2,66,430 పల్లెల్లో సర్వే చేసిన అనంతరం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భూసారపరీక్ష కేంద్రాలు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ డిగ్రీకాలేజీలు, వృత్తి విద్యా కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ కేంద్రాలు కేవలం 10%లోపు పల్లెలకు మాత్రమే పరిమితమయ్యాయి. గ్రామాల్లో అత్యధికంగా ఉన్న సౌకర్యం అంగన్‌వాడీ కేంద్రాలే. మొబైల్‌ ఫోన్‌ సౌకర్యం, ఇంటర్‌నెట్‌/బ్రాడ్‌బ్యాండ్, పోస్టాఫీసులు, పంచాయతీభవనాలు, రహదారి అనుసంధానం బాగానే ఉన్నట్లు తేలింది. 
*మరోవైపు వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన గ్రామీణ వైద్య నివేదిక ప్రకారమూ పల్లెల్లో ఉన్న ఆసుపత్రుల్లోనూ సరైన వైద్యసిబ్బంది లేరు. డాక్టర్ల నుంచి ల్యాబ్‌ టెక్నీషియన్లవరకు  80వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అందులో తేలింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని